Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ట్విట్టర్... లాగిన్ చేస్తే ఎర్రర్ మెసేజ్!

  • ట్విట్టర్ సేవలకు అంతరాయం
  • ట్విట్టర్ వర్గాలకు ఫిర్యాదుల వెల్లువ
  • సమస్యను పరిష్కరిస్తామన్న యాజమాన్యం 
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం నుంచి ట్విట్టర్ నిలిచిపోయింది. లాగిన్ అయితే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. దీనిపై ట్విట్టర్ నుంచి వివరణ వచ్చింది. లోపం ఎక్కడుందో కనుక్కుని, దాన్ని పరిష్కరించే పనిలో తమ నిపుణులు తలమునకలై ఉన్నారని, త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ట్విట్టర్ వర్గాలు పేర్కొన్నాయి. ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ కాలేకపోతున్నామంటూ ప్రపంచవ్యాప్తంగా 4000కి పైగా రిపోర్టులు ట్విట్టర్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ముఖ్యంగా, జపాన్, కెనడా, భారత్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది.
Twitter
Social Media

More Telugu News